ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మరియు బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖల్లో మొత్తం 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 29లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు జీతం పొందగల
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తూ నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మరియు బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అర్హత కలిగిన మరియు ఆసక్తి గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం మూడు విభాగాల కింద ఖాళీల భర్తీతో సంబంధించింది.
పోస్టుల వివరాలు
•హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్) కోసం 41 పోస్టులు ఉన్నాయి.
•హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (ట్రైబల్ వెల్ఫేర్) కోసం 23 పోస్టులు.
•హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్) కోసం 33 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హతలు :
అభ్యర్థుల కోసం పోస్టుల ఆధారంగా నిర్దేశించిన విద్యార్హతలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ పోస్టులకు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు బీఈడి లేదా బీఈటీ డిగ్రీ అవసరం. అలాగే, ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు డిగ్రీతో పాటు ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) అవసరమవుతుంది. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ పోస్టులకు కూడా డిగ్రీతో పాటు బీఈడి లేదా సమానమైన అర్హత అవసరం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉండేవి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించడం మంచిది.
దరఖాస్తు ఫీజు వివరాలు :
జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250తో పాటు పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులు ఫీజు చెల్లించే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలను పరిశీలించాలి.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల నియామకానికి రాత పరీక్ష, సర్టిఫికెట్ పరిశీలన, మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలోని ప్రతి దశకు సన్నద్ధంగా ఉండాలి. ఎంపికైన నిర్దిష్ట అభ్యర్థులకు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.
రాత పరీక్ష వివరాలు :
ఈ నియామకానికి కంప్యూటర్ ఆధారిత సింగిల్ లెవెల్ ఆబ్జెక్టివ్ విధానం ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి:
- పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు
- పేపర్-2: ఎడ్యుకేషన్ – 150 మార్కులు
ఇవి కలిపి మొత్తం 300 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం మొత్తం 300 నిమిషాలు ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది, అందువల్ల జవాబులు గుర్తించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
పరీక్ష సిలబస్, మార్కుల విధానం, మరియు నెగెటివ్ మార్కింగ్ విషయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వాలి. అలాగే దరఖాస్తు చేయడం ముందు ఏపీపీఏస్సీ అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం ముఖ్యం
Website Link : https://portal-psc.ap.gov.in/
Online దరఖాస్తు కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.















Leave a Reply